భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్‌లగన్, తెలంగాణలోని సికింద్రాబాద్ నడుమ ప్రత్యేక రైలును నడుపుతుంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సదుపాయం అందనుంది. ఏప్రిల్ 10 నుండి మే 22 మధ్య నడిచే రైలు నెం. 07046 సికింద్రాబాద్ - నహర్‌లగన్, శుక్రవారాల్లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి ఆదివారాల్లో సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక పత్రికా ప్రకటనలో ప్రయాణికులకు తెలియజేసింది.
అదేవిధంగా ఏప్రిల్ 13 నుండి మే 25 మధ్య నడిచే రైలు నెం.07047 నహర్‌లగన్ - సికింద్రాబాద్ సోమవారాల్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బుధవారాల్లో రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.