Southwest monsoon : బ్యాడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ- ఈ ఏడాది వర్షాలు.. అంచనాల కన్నా తక్కువే! కేరళని తాకేదెప్పుడు?
భారతదేశం, మే 29 -- దేశంలో రాబోయే నైరుతి రుతుపవనాల వర్షపాతానికి సంబంధించి శుక్రవారం కీలక అప్డేట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ఈ ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 90 శాతం కాలానుగుణ వర్షపాతం (ఎల్పీఏ) నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఏప్రిల్లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే ఎండలతో అల్లాడిపోతూ వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది.
జూన్ నెలలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడి, సీజన్ ద్వితీయార్థంలో అవి మరింత బలపడటమే తాజా అంచనాలకు ప్రధాన కారణమని ఐఎండీ స్పష్టం చేసింది. తక్కువ వర్షపాతం అంచనాలతో దేశ వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న బలహీనమైన ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా "సాధారణం కంటే తక్కువ" వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.