భారతదేశం, నవంబర్ 6 -- KTR Jagan Vijay Meeting : దక్షిణ భారత రాజకీయంలో ఒక్కసారిగా ఆసక్తి రేకెత్తించే రీతిలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక ఇందుకు వేదికగా మారింది. తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఒకే వేదికపై కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కుటుంబ శుభకార్యం వేదికగా ఈ ముగ్గురు కీలక నాయకులు ఒకే చోట కలుసుకున్నప్పటికీ, పరోక్షంగా ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ అవగాహన లేదా సమీకరణాలకు ఇది పునాది వేస్తుందా అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.

ఈ నాయకుల కలయిక తక్షణమే ఏదో ఒక రాజకీయ కూటమి...