భారతదేశం, మే 5 -- South Coastal Railway Zone Gazette : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్తగా ఏర్పడిన 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' కార్యకలాపాలపై కేంద్ర రైల్వే బోర్డు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది.

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) మే 4, 2026న ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1989 రైల్వే చట్టంలోని సెక్షన్ 3(4) ప్రకారం. కొత్త రైల్వే జోన్‌గా 'సౌత్ కోస్ట్ రైల్వే' (South Coast Railway)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జూన్ 1, 2026 నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించింది.

ఈ రైల్వే జోన్ ఏర్పాటుపై 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమ...