భారతదేశం, ఆగస్టు 31 -- సెంట్రల్ రైల్వే పరిధిలోని పుణె, హడ్ప్సర్ (Hadapsar) యార్డ్‌లలో 3వ రైల్వే లైన్ కమిషనింగ్ కోసం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రయాణించే ప్యాసింజర్లు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ ఎక్స్‌ప్రెస్ (11302) సెప్టెంబర్ 22న బయలుదేరే రైలు సోలాపూర్-కుర్దువాడి-మిరజ్-సతారా-పుణె మీదుగా నడుస్తుంది.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22159) సెప్టెంబర్ 19 నుండి 23 వరకు, అక్టోబర్ 4న కళ్యాణ్-ఇగత్‌పురి-మన్మాడ్-దౌండ్ మీదుగా వెళ్తుంది.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - భువనేశ్వర్ న్యూ (11019) సెప్టెంబర్ 20న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-...