భారతదేశం, ఏప్రిల్ 23 -- Soul Trip OTT: తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న 'ఈటీవీ విన్' (ETV Win).. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 'కథా సుధ' వంటి ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న ఈ ప్లాట్‌ఫామ్.. తాజాగా 'సోల్ ట్రిప్' (Soul Trip) పేరుతో దేశంలోనే మొట్టమొదటి ట్రావెల్ బేస్డ్ సెలబ్రిటీ టాక్ షోను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హీరో విజయ్ దాట్ల హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో.. సాధారణ టాక్ షోలకు భిన్నంగా సెలబ్రిటీలతో కలిసి అందమైన పర్యాటక ప్రాంతాల్లో సాగుతుంది. గండభేరుండ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ వినూత్న కార్యక్రమం.. కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా సెలబ్రిటీల వ్యక్తిగత ప్రయాణ జ్ఞాపకాలు, వారి జీవితంలోని ఆసక్తికర మలుపులను ప్రకృతి ఒడిలో పంచుకునేలా ప్లాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.