భారతదేశం, ఏప్రిల్ 23 -- Soul Trip OTT: తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న 'ఈటీవీ విన్' (ETV Win).. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 'కథా సుధ' వంటి ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న ఈ ప్లాట్‌ఫామ్.. తాజాగా 'సోల్ ట్రిప్' (Soul Trip) పేరుతో దేశంలోనే మొట్టమొదటి ట్రావెల్ బేస్డ్ సెలబ్రిటీ టాక్ షోను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హీరో విజయ్ దాట్ల హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో.. సాధారణ టాక్ షోలకు భిన్నంగా సెలబ్రిటీలతో కలిసి అందమైన పర్యాటక ప్రాంతాల్లో సాగుతుంది. గండభేరుండ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ వినూత్న కార్యక్రమం.. కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా సెలబ్రిటీల వ్యక్తిగత ప్రయాణ జ్ఞాపకాలు, వారి జీవితంలోని ఆసక్తికర మలుపులను ప్రకృతి ఒడిలో పంచుకునేలా ప్లాన్...