భారతదేశం, మార్చి 14 -- గతేడాది సెప్టెంబర్‌లో లేహ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్​పై విధించిన నిర్బంధాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్​ఏ) శనివారం తెలిపింది. వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (ఎన్​ఎస్​ఏ) కింద నిర్బంధించి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు పంపిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

హింసాత్మక నిరసనల తర్వాత 'ప్రజా శాంతిని కాపాడటానికి' వాంగ్‌చుక్‌ను నిర్బంధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

"లద్ధాఖ్​లో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తద్వారా అన్ని వర్గాలతో నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన చర్చలు జరపడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, తగిన పరిశీలన తర్వాత, జాత...