భారతదేశం, జూన్ 22 -- Singer Sona Mohapatra Criticizes Music Industry: బాలీవుడ్‌లో లింగ వివక్ష, మహిళలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడే సింగర్ సోనా మోహపాత్ర తాజాగా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

కేవలం సినిమాల్లోనే కాదు, సంగీత ప్రపంచంలోనూ మహిళల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోందని సోనా మోహపాత్ర మండిపడ్డారు. ప్రత్యేకించి ప్రేమ, విరహ గీతాలలో (Heartbreak songs) మహిళా గాయనీలకు ఇచ్చే ప్రాధాన్యత నానాటికీ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో (Literature Festival) సోనా మోహపాత్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు కేరళ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని, అందుకే ఇక్కడ ఈ నిజాలు మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు.

గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో వస్తున్న మార్పులను గమనిస్తే, శ్రేయ...