భారతదేశం, ఆగస్టు 10 -- Somasila Krishna River : కృష్ణానది తీరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటకులకు మళ్లీ విహార వేడుక అందుబాటులోకి వచ్చింది. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేయడంతో, ఇక్కడ కృష్ణానదిలో నీటి మట్టం స్థిరంగా మారింది. దీంతో గత కొంతకాలంగా నిలిచిపోయిన బోటింగ్ సేవలను ఆదివారం నుంచి అధికారులు అధికారికంగా పునఃప్రారంభించారు.

వేసవి కాలంలో కృష్ణానదిలో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటక శాఖ బోటింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరాయి. నదిలో నీటి లభ్యత పుష్కలంగా పెరగడంతో సోమశిల వద్ద మళ్లీ బోటింగ్ నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటక శా...