Software Charge : ఆస్తి పన్నుతో పాటు ఇక నుంచి 'సాఫ్ట్వేర్ ఛార్జీ' బాదుడు.. ప్రజలకు షాకిచ్చిన ప్రభుత్వం!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్లు, వ్యాపార సముదాయాలు కలిగిన పన్ను చెల్లింపుదారులకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) ఊహించని షాక్ ఇచ్చింది! ఇప్పటివరకు ఉన్న ఆస్తి పన్నుతో పాటు ఇక నుంచి అదనంగా ప్రతీ ఏటా 'సాఫ్ట్వేర్ ఛార్జీ' వసూలు చేయడం ప్రారంభించింది. ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండా, ఆర్థిక సంవత్సరం మధ్యలోనే ఈ పెంపును అమల్లోకి తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఐటీ కారిడార్‌గా పేరొందిన బెంగళూరులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి స్థిరపడిన వేలాది మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సొంత ఆస్తులు కలిగి ఉన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా అమల్లోకి తెచ్చిన ఈ నూతన రుసుములు ఇప్పుడు స్థానిక పన్నుదారుల జేబులకు చిల్లులు పొడుస్తున్నాయి.
జీబీఏ పరిధిలోని ఐదు ప్రధాన కార్పొరేషన్ల ద్వారా ఈ రుసుములను వసూలు చేస్తున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.