భారతదేశం, ఏప్రిల్ 28 -- Sodara OTT: ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ 'సోదరా' వచ్చేస్తోంది. థియేటర్లో రిలీజైన ఏడాది తర్వాత ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుండటం గమనార్హం. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు హీరో. బ్రోమాంటిక్ స్టోరీగా ఈ సోదరా సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

సంపూర్ణేశ్ బాబు, సంజోష్ అన్నదమ్ములుగా నటించిన తెలుగు కామెడీ సినిమా 'సోదరా'. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. మే 1, 2026న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు షేర్ చేసింది.

సోదరా మూవీ ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ మూవీని థియేటర్లో ఎవరూ...