భారతదేశం, ఆగస్టు 5 -- Sobhita Dhulipala: "కమ్యూనిజం ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది" అంటూ ప్రముఖ నటి, అక్కినేని ఇంటి కోడలు శోభిత ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద వివాదంగా మారాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తూ, వేల కోట్ల ఆస్తులున్న కుటుంబానికి కోడలిగా వెళ్లి ఇలాంటి డొల్ల సిద్ధాంతాలు మాట్లాడటం ఏంటని నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శోభిత తన పర్సనల్ భావాలను పంచుకుంటూ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ బయటకు రాగానే ఎక్స్ వేదికగా నెటిజన్లు ఆమె వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నారు.

శోభిత ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మీ గురించి ఓ సీక్రెట్ చెప్పమని యాంకర్ అడిగినప్పుడు.. తనకు కచ్చితమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయని, తాను లెఫ...