భారతదేశం, ఆగస్టు 26 -- Sobhita Dhulipala: సినీ ఇండస్ట్రీలో పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న శోభితా ధూళిపాళ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమాతో శోభితా ధూళిపాళ్ల వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే వేధింపులకు గురవుతూనే మానసికంగా బలమైన ప్రతిఘటన చూపే సంక్లిష్టమైన స్త్రీ పాత్రలో ఆమె నటించి ప్రశంసలు అందుకున్నారు.

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యను 2024 డిసెంబర్ లో శోభితా ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైని పెళ్లి చేసుకోవడంపై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

"ఒక నటుడిని లేదా నా సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నతనం నుంచే నా మనసులో ఒక కోరిక ఉండేది. నా మాతృభూమి సాంస్కృతిక విశేషాలు, సంప్ర...