భారతదేశం, ఆగస్టు 14 -- తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల రూపంలో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు అత్యాధునిక డిజైన్‌తో కూడిన ఆహార భద్రత కార్డుల(Smart Ration Cards) పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. డూప్లికేషన్, నకిలీ కార్డుల ముప్పునకు శాశ్వతంగా చెక్ పెడుతూ పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నూతన కార్డుల తయారీలో ప్రభుత్వం అత్యున్నత రక్షణ ప్రమాణాలను పాటించింది. సాధారణంగా బ్యాంక్ నోట్లు, పాస్‌పోర్టులు, ఇతర గోప్యమైన ప్రభుత్వ పత్రాల తయారీలో వాడే 9 రకాల హై-టెక్ సెక్యూరిటీ ఫీచర్లను ఈ స్మార్ట్ కార్డుల్లో పొందుపరిచారు.

ఈ కార్డులను ప్రత్యేక పరికరాలతో స్కాన్ చేయగానే, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే డిజిటల్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉండటం వల్ల ఈ కార్డులను కాపీ చేయడం గానీ,...