భారతదేశం, ఆగస్టు 17 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న స్కోడా ఆటో సంస్థ.. తన పాపులర్ మిడ్‌సైజ్ సెడాన్ 'స్లావియా ఫేస్‌లిఫ్ట్'ని ఆగస్టు 18, 2026న విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారుకు సంబంధించి కంపెనీ కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది. ప్రస్తుత మోడల్ ఇంజిన్ లైనప్ అయిన 1.0-లీటర్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లను అలాగే కొనసాగిస్తూనే, డిజైన్, ఫీచర్ల పరంగా అనేక అప్‌డేట్లను ఈ కొత్త వెర్షన్‌లో అందిస్తున్నారు.

లాంచ్ నేపత్యంలో స్కోడా స్లావియా ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్త స్లావియా డిజైన్ మరింత షార్ప్‌గా ఉండనుంది. ముందు భాగంలో గ్రిల్ అదే ఆకారంలో ఉన్నప్పటికీ, క్రోమ్ ఫినిషింగ్‌లో మార్పులు చేశారు. హెడ్‌ల్యాంప్‌ల డిజైన్‌ను కూడా కొద్దిగా మార్చా...