భారతదేశం, సెప్టెంబర్ 4 -- Sivaji OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ మరోసారి ఓ పెద్ద చర్చకే తెరలేపారు. తాజాగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఓటీటీ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఓటీటీ అనేది కేవలం పనీపాటా లేని సోమరిపోతులకే అని ఆయన అనడం గమనార్హం. ఓటీటీల్లో సినిమాలు చూసేవాళ్లను ఉద్దేశించి శివాజీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సమయం ఎక్కువ ఉండి, ఖాళీగా ఇంట్లో పడుకోవడానికి ఇష్టపడేవాళ్లే ఓటీటీ వేదికలపై ఆధారపడుతున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే అనుభూతి వేరని, దానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఏమాత్రం సాటిరావని ఆయన స్పష్టం చేశారు.

ఇంట్లో కూర్చుని ఫోన్లలో, టీవీల్లో సినిమాలు చూడటం వల్ల నిజమైన సినిమా మ్యాజిక్ దెబ్బతింటోందని శివ...