భారతదేశం, ఆగస్టు 11 -- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఓట్ల కోత తప్పడం లేదు. బూత్ స్థాయి అధికారులుసేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అందిన తుది సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 74 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో తొలగిపోనున్న ఓట్లలో అధిక భాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1.14 కోట్ల ఓటర్లు ఉండగా.. కేవలం 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. మిగిలిన 43.09 లక్షల మంది ఓటర్లు తమ పత్రాలను సమర్పించలేదు. దీంతో ఈ 43 లక్షలకు పైగా ఓట్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించేందుకు అధికారుల...