భారతదేశం, మే 26 -- Special Intensive Revision in Andhrapradesh : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయడానికి, సరికొత్తగా అప్‌డేట్ చేయడానికి 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026' (Special Intensive Revision - SIR) ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సవరణ ప్రక్రియకు జూలై 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతున్నారు. మొత్తం 46,397 మంది బూ...