భారతదేశం, ఆగస్టు 10 -- రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియకు ఇవాళ్టి(ఆగస్ట్ 10,2026)తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఫారాలు సమర్పించని ఓటర్లకు ఈరోజే ఆఖరి అవకాశమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకపోతే రాబోయే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 2.64 కోట్ల మంది వివరాలను డిజిటలైజేషన్‌ చేశారు. ప్రస్తుతం బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌వో) వద్ద మరో ఐదు లక్షల పత్రాలు డిజిటలైజేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి.

మరోవైపు ఇంకా 69 లక్షల మంది ఓటర్ల నుంచి ఎన్యూ...