భారతదేశం, ఆగస్టు 18 -- SIR Claims Objections : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (SIR-2026) ప్రక్రియ కొనసాగుతోంది.క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 16, 2026 వరకు ఓటర్లు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

జూన్ 25, 2026 నుంచి ఆగస్టు 10, 2026 వరకు నిర్వహించిన ఎన్యుమరేషన్ సమయంలో నిర్దేశిత ఫారమ్‌లను సమర్పించలేకపోయిన ఓటర్లకు ఇది మరో అవకాశం. అలాంటి అభ్యర్థులు ఇప్పుడు నిర్ణీత డిక్లరేషన్‌తో పాటు ఫారమ్-6 ద్వారా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో సవరణలు చేయడం, తప్పుగా నమోదైన పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.

ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల కమిషన్ వివిధ అవసరాల కోసం ప్రత్యేక ఫారమ్‌లను అందుబాటులో ఉంచింది.

అందిన అభ్యంతరాలు, క...