భారతదేశం, జూలై 28 -- Singer Badshah Wife Isha Rikhi Post: బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్‌షా, ఆయన భార్య ఇషా రిఖి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన నాలుగు నెలలకే వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇషా రిఖి ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు.

తన భర్తకున్న అధికారం, ఆధిపత్యం చూసి భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై దేనికీ భయపడేది లేదని ఇషా రిఖి స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ ఎమోజీతో ఈషా తన ఆవేదనను వ్యక్తపరిచారు ఇషా.

"కొన్ని యుద్ధాలు శరీరానికి కనిపించని గాయాలను మిగుల్చుతాయి. నా భర్తకున్న అధికారం, హోదా, ఆర్థిక బలగం చూసి భయపడ్డాను. అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండటమే సురక్షితం అని భావించాను" అని ఇషా ఆవేదన వ్యక్తం చేశారు.

"అయితే నా మౌనం నా అంగీకారం ...