భారతదేశం, మార్చి 31 -- 2025లో వచ్చిన 'బర్గద్' పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సింగర్ అర్పిత్ బాలా. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తన లైవ్ కాన్సెర్ట్‌లో అర్పిత్ బాలా చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రదర్శన ఇస్తుండగా ఎవరో బాటిల్ విసరడంతో ఆగ్రహానికి గురైన అర్పిత్ బాలా సదరు అభిమానిపై ఉమ్మివేసి నానా రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

మార్చి 28న హైదరాబాద్‌లోని 'కింగ్‌డమ్ క్లబ్ అండ్ కిచెన్'లో అర్పిత్ బాలా కచేరీ జరుగుతోంది. ప్రదర్శన మధ్యలో ఉండగా ప్రేక్షకుల నుంచి ఎవరో ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను స్టేజ్ మీదకు విసిరారు. అది నేరుగా అర్పిత్ కంటికి తగిలింది. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన అర్పిత్ బాలా బాటిల్ విసిరిన వ్యక్తిని వేలెత్తి చూపిస్తూ బూతులు లంకించుకున్నారు.

వైరల్ అవుత...