భారతదేశం, ఏప్రిల్ 26 -- Singer Shreya Ghoshal Real Estate Buys 3 Flats: మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ వరుస పెట్టి ఆస్తులు కొంటున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన శాంతాక్రజ్ వెస్ట్ ప్రాంతంలో సింగర్ శ్రేయా ఘోషల్ రూ. 20.88 కోట్లు వెచ్చించి ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. అంటే సుమారు రూ. 21 కోట్లు అన్నమాట.

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన డాక్యుమెంట్ల ప్రకారం.. శ్రేయా ఘోషల్ తన కుటుంబ సభ్యులు శర్మిష్ఠ ఘోషల్, బిశ్వజిత్ ఘోషల్‌తో కలిసి ఈ ఆస్తిని రిజిస్టర్ చేయించారు.

శ్రేయా ఘోషల్ పెట్టుబడులు చూస్తుంటే ఆమె రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల (ఏప్రిల్) ప్రారంభంలోనే ముంబైలోని వర్లీలో దాదాపు రూ. 60 కోట్లతో రెండు ఖరీదైన ఫ్లాట్లను శ్రేయా ఘోషల్ కొనుగోలు చేశారు. ...