భారతదేశం, అక్టోబర్ 4 -- Singeetham Srinivasa Rao: ఇండియన్ సినిమాలకు వినూత్న ప్రయోగాల రూపురేఖలు అద్దిన మహోన్నత సృష్టికర్త సింగీతం శ్రీనివాసరావు (94). ఈ లెజెండరీ డైరెక్టర్ వయోభారంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. 'సినిమాకు ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు.. ప్రయోగాలే దాని ఆయువు పట్టు' అని నమ్మిన ఒక లెజెండ్ ప్రస్థానం ముగిసింది. ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, వెండితెరపై ఆయన లిఖించిన అద్భుతాలు ఎప్పటికీ అమరమే.

మహానటులు ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ సినిమా 'మాయాబజార్'కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు సింగీతం శ్రీనివాసరావు. లెజెండరీ దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద నేర్చుకున్న మెళకువలతో సింగీతం సరికొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టించారు. ఏడేళ్ల క్రితం 'కల్కి 2898 AD' కోసం నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్న సింగీతం.. 2026లో తన ...