Simhachalam Chandanotsavam : సింహాచలం చందనోత్సవానికి టిక్కెట్ల పంపిణీపై గందరగోళం
భారతదేశం, ఏప్రిల్ 19 -- విశాఖ సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి టిక్కెట్ల పంపిణీపై గందరగోళం, అసంతృప్తి నెలకొన్నాయి. శాసనసభ్యులకు ప్రోటోకాల్ కోటా కింద టిక్కెట్ల కేటాయింపుపై వివాదం చెలరేగింది. ప్రతి ఎమ్మెల్యేకు గరిష్టంగా 25 టిక్కెట్లు మాత్రమే లభిస్తాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పలువురు ఎన్నికైన ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ టికెట్ల కేటాయింపును స్వీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న పద్ధతులకు విరుద్ధంగా, కొందరు ప్రజాప్రతినిధులకు అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించగా, నగర ఎమ్మెల్యేలను పక్కన పెట్టారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్సవ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూసే ప్రయత్నంలో భాగంగా ఏర్పాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.