భారతదేశం, అక్టోబర్ 3 -- Sigma OTT Release Details: సినిమాలు ఇలా థియేటర్లలో విడుదల కాగానే అలా ఓటీటీ వివరాలపై రోజురోజుకీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా నిన్న (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలైన సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

నేచురల్ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే సిగ్మా. తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ఇది.

సిగ్మా సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. మంచి అంచనాలతో నిన్న అంటే అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది సిగ్మా సినిమా. తొలి చిత్రం నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించిన జేసన్.. హీరో సందీప...