భారతదేశం, జూలై 2 -- భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టాటా మోటార్స్ ఇటీవల తన ఐకానిక్ మోడల్ 'సియెర్రా ఈవీ'ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో చేరిన ఈ 6వ ఎలక్ట్రిక్ కారు.. ముఖ్యంగా తన క్వాడ్-వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) ఆప్షన్‌తో వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, టాటా లైనప్‌లో ఈ క్యూడబ్ల్యూడీ టెక్నాలజీతో పరిచయమైన మొదటి కారు సియెర్రా కాదు. అంతకంటే ముందే మార్కెట్లోకి అడుగుపెట్టిన 'టాటా హారియర్ ఈవీ'లోనే కంపెనీ ఈ పవర్‌ఫుల్ సెటప్‌ను మొదట తీసుకొచ్చింది.

మరి ఒకే బ్రాండ్ నుంచి దాదాపు ఒకే రకమైన ఫీచర్లతో కనిపిస్తున్న ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మధ్య ఉన్న అసలు తేడాలేంటి? పవర్, మైలేజ్, ధరల్లో ఏది ముందంజలో ఉందో ఇక్కడ తెలుసుకోండి..

క్యూడబ్ల్యూడీ అంటే క్వాడ్ వీల్ డ్రైవ్. ఆటోమొబైల్​ ...