భారతదేశం, జూన్ 5 -- Shreyas Iyer: అంతా ఫిక్స్ అయిపోయింది. టీమిండియా టీ20 ఫార్మాట్‌కు కొత్త బాస్ రాబోతున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్‌లకు సంబంధించి శనివారం (జూన్ 6) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుండగా.. శ్రేయస్ అయ్యర్‌ను అధికారికంగా టీ20 కెప్టెన్‌గా ప్రకటించబోతున్నట్లు బీసీసీఐ (BCCI) వర్గాల నుంచి పక్కా సమాచారం అందుతోంది.

సూర్యకుమార్ యాదవ్‌కు ఇది నిజంగా డబుల్ షాక్ అని చెప్పాలి. కెప్టెన్సీ పోవడమే కాకుండా, పేలవమైన ఫామ్ కారణంగా ఏకంగా జట్టుకే దూరం కాబోతున్నాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ దక్కే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 2023 తర్వాత ఇండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడని శ్రేయస్.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.

ఇండియన్ క్రికెట్‌లో గత రెండేళ్లుగా ఒక కొత్త ట్రెం...