భారతదేశం, మార్చి 16 -- బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు స్వస్తి చెప్పాలనే అరిజీత్ సింగ్ నిర్ణయంపై ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ స్పందించింది. బ్రేక్ తీసుకోవాలనే ఆలోచన తనకూ వస్తుంటుందని చెబుతూ, అరిజిత్ తీసుకున్నది చాలా సాహసోపేత నిర్ణయమని ఆమె ప్రశంసించింది.

ఇటీవల ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. అరిజీత్ సంగీతం పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో వివరించింది.

లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రాముఖ్యత గురించి ఆమె చెప్పింది. ఒక ఆర్టిస్టుగా స్టేజ్ మీద పాడటమే తన అసలు గుర్తింపు అని శ్రేయా తెలిపింది. స్టేజ్ మీద లిప్-సింక్ చేయడం తనకు అస్సలు నచ్చదని, ఒకవేళ అదే చేయాల్సి వస్తే పాడటం ఆపేస్తానని స్పష్టం చేసింది.

"నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాను. అరిజీత్ చాలా ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అతడు మనసు పెట్టి సంగీతం చేస్తా...