భారతదేశం, ఏప్రిల్ 11 -- టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో దూసుకుపోతున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఏరియాల్లో ఒకటిగా పేరుగాంచిన వర్లీలో శ్రేయా ఘోషల్ రెండు ఖరీదైన ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు.

రియల్ ఎస్టేట్ దిగ్గజం 'గోద్రెజ్ ప్రాపర్టీస్' నిర్మిస్తున్న 'గోద్రెజ్ ట్రైలాజీ' ప్రాజెక్టులో ఈ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న ఈ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.

మొదటి అపార్ట్‌మెంట్ వివరాల్లోకి వెళ్తే.. దీని కార్పెట్ ఏరియా సుమారు 2,430 చదరపు అడుగులు కాగా, మొత్తం ఏరియా 2,750 చదరపు అడుగులుగా ఉంది. ఈ ఒక్క ప్లాట్ కోసమే శ్రేయా కుటుంబం రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీని ప్రభుత్వానికి చెల్లించి...