భారతదేశం, సెప్టెంబర్ 27 -- Shiva Raj Kumar OTT: సీనియర్ హీరో శివ రాజ్‌కుమార్ ఇటీవల విడుదలైన సూర్య, మమితా బైజుల హిట్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) పై ప్రశంసల వర్షం కురిపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా చూశాక తనకు రాత్రి నిద్రపట్టలేదని శివన్న అన్నారు.

తన కొత్త సినిమా 'బెయిల్' (Bail) అక్టోబర్ 2న విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ శివన్న ఎమోషనల్ అయ్యారు.

"నేను ఇటీవల 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చూశాను. సినిమా చూశాక దాదాపు గంటసేపు నాకు నిద్రపట్టలేదు. నా కళ్లలో ...