భారతదేశం, జూలై 23 -- Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కొనుగోలుకు సంబంధించి మైండ్ బ్లాకింగ్ విషయాలను బయటపెట్టారు. 2009లో శిల్పా శెట్టికి వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇవ్వడానికే రూ. 81.9 కోట్లు (దాదాపు రూ. 82 కోట్లు) పెట్టి రాజస్థాన్ రాయల్స్ షేర్లు కొన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా ఐపీఎల్ బిజినెస్ సీక్రెట్స్ పంచుకున్నారు. తాను పెట్టుబడి పెట్టినప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ వాల్యుయేషన్ దాదాపు రూ. 700 కోట్లుగా ఉండేది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ మైండ్ బ్లాకింగ్ రీతిలో రూ. 16,000 కోట్లకు చేరుకుందని చెప్పారు. శిల్పా శెట్టికి ఉన్న బిగ్ క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ చూసే తాను ఆ రోజు భారీగా డబ్బ...