భారతదేశం, ఏప్రిల్ 5 -- ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ అంటూ 'బైకర్'తో థియేటర్లకు వచ్చాడు శర్వానంద్. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచి టాక్ తో థియేటర్లలో బైకర్ మూవీకి ప్రేక్షకులు జై కొడుతున్నారు. ఈ మూవీ సక్సెస్ తో శర్వానంద్ ఎమోషనల్ అయ్యాడు. ఓ థియేటర్లో స్క్రీన్ కు సాష్టాంగ నమస్కారం పెట్టాడు.

బైకర్ మూవీతో శర్వానంద్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (ఏప్రిల్ 3)న రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ఎమోషనల్ అయ్యాడు. హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో బిగ్ స్క్రీన్ కు శర్వానంద్ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత తెరను ముట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సమయంలో శర్వా ఎమోషనల్ అయ్యాడు.

సినిమా థియేటర్లోని స్క్రీన్ కు శర్వానంద్ సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...