భారతదేశం, జూన్ 28 -- Sharmiela Mandre Sudhan Sundaram Engagement: దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మరో స్టార్ కపుల్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. కన్నడ చిత్రసీమలో హీరోయిన్‌గా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న షర్మిల మాండ్రే సరికొత్త జీవిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'ప్యాషన్ స్టూడియోస్' అధినేత, ప్రముఖ నిర్మాత సుధన్ సుందరంతో షర్మిల మాండ్రే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది.

సాంప్రదాయ పద్ధతిలో, ఎంతో హుందాగా సాగిన ఈ వేడుకలో షర్మిల, సుధన్ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయిన ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వీరికి సంబంధించిన నిశ్చితార్థపు ఫోటోలు ప్రస్తుతం సోషల్...