భారతదేశం, జూన్ 22 -- Shanmukh Jaswanth Wedding: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి ఆర్భాటాలు, హడావుడి లేకుండా షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి జరిగింది.

యూట్యూబ్ సిరీస్ లు, డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి చేసుకున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వైష్ణవి చోడిశెట్టిని షణ్ముఖ్ వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పుడు షణ్ముఖ్ తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు.

ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి పెళ్లి జరిగిపోయింది. వీళ్ల పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో ప్...