భారతదేశం, ఆగస్టు 13 -- Shakeela: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన క్రేజ్‌తో ఊపేసి, శృంగార తార‌గా పేరు తెచ్చుకున్న నటి నటి షకీలా ఇటీవల మెడ సంబంధిత సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో బ్లాగ్ (Vlog) పోస్ట్ చేస్తూ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె మెడకు 'నెక్‌ కాలర్' ధరించి ఉన్నారు.

షకీలాకు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎక్కువగా ఫోన్ వాడటమే. ''ప్రతి రోజూ మంచంపై ఒకపక్కకి ఒరిగి పడుకుని వరుసగా 4 గంటల పాటు మొబైల్‌లో గేమ్‌లు ఆడేదాన్ని. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచేదాన్ని. గేమ్ పూర్తయ్యాక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపేదాన్ని''అని షకీలా తన వీడియోలో వెల్లడించారు.

''సరైన పొజిషన్‌లో...