భారతదేశం, మే 3 -- Ex ACP Reveals Shah Rukh Khan Wankhede Fight 2012: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో షారుఖ్ ఖాన్ 'వాంఖడే వివాదం' ఒకటి. 2012లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ గొడవపై అప్పట్లో విధులు నిర్వహించిన మాజీ ఏసీపీ ఇక్బాల్ షేక్ 14 ఏళ్ల తర్వాత తాజాగా నోరు విప్పారు.

ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత మైదానంలో చోటుచేసుకున్న హైడ్రామా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వాంఖడే స్టేడియం పరిధిలోని డివిజనల్ ఏసీపీగా ఉన్న ఇక్బాల్ షేక్ ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అది కేవలం ఒక 'మిస్ కమ్యూనికేషన్' వల్ల జరిగిన గొడవ అని ఆయన స్పష్టం చేశారు.

"నేను మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లేసరికి, ఎంసీఏ (MCA) అధికారి ఒకరు వచ్చి షారుఖ్ ఖాన్ 'రాడా' (గొడవ) చేస్తున్నాడని చెప్పారు...