భారతదేశం, ఏప్రిల్ 16 -- Shah Rukh Khan In Allu Arjun Raaka: తెలుగు సినిమా స్థాయిని 'పుష్ప'తో ప్రపంచవ్యాప్తం చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో కలిసి 'రాకా' అనే సినిమాను పట్టాలెక్కించారు. అట్లీ గత చిత్రం 'జవాన్'తో షారుఖ్ ఖాన్‌కు వెయ్యి కోట్ల వసూళ్లను అందించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే దర్శకుడు అల్లు అర్జున్‌తో సినిమా చేస్తుండటంతో, ఇందులో షారుఖ్ ఖాన్ ఒక చిన్న పాత్రలో కనిపిస్తే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ సినిమా పాన్-ఇండియా అప్పీల్‌ను మరింత పెంచడానికి బాలీవుడ్ బాద్‌షా రాక.. రాకాకు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, షారుఖ్ ఖాన్ ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2'లో అతిథి పాత్ర చేసే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన తన...