భారతదేశం, మే 15 -- Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గ్యారేజీలో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు కొలువై ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో అద్భుతమైన వాహనం వచ్చి చేరింది. రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఒక ఖరీదైన కారును షారుఖ్ కొనుగోలు చేశాడు.

ఇటీవల ముంబై వీధుల్లో తన సరికొత్త కార్లో రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ షారుఖ్ ఖాన్ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో ఈ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి. అసలు ఈ కారు ఏంటీ? రేట్ ఎంత? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

షారుఖ్ ఖాన్ కొత్తగా కొనుగోలు చేసిన ఈ కారు పేరు 'కాడిలాక్ ఎస్కలేడ్'. విశేషమేమిటంటే, ఈ కార్లను కాడిలాక్ సంస్థ అధికారికంగా భారతదేశంలో విక్రయించదు. షారుఖ్ దీనిని విదేశాల నుంచి ప్రైవేట్‌గా దిగుమ...