భారతదేశం, ఆగస్టు 10 -- Shah Rukh Khan Praised Chef Vikas Khanna Restaurant: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారతీయ రుచుల గుబాళింపులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రముఖ మాస్టర్ చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్ 'బంగ్లా' (Bungalow) ఇప్పుడు ప్రపంచ స్థాయి సెలబ్రిటీల కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

కేవలం రుచికరమైన వంటకాలకే పరిమితం కాకుండా, మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల శేఖర్ సుమన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'శేఖర్ టునైట్' టాక్ షోలో పాల్గొన్న వికాస్ ఖన్నా, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన రెస్టారెంట్‌ను సందర్శించినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

షారుఖ్ ఖాన్ తన రెస్టారెంట్‌కు వచ్చినప్పుడు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయని వికాస్ ఖన్నా తెలిపారు. ఈ భేటీ సందర్భంగా కింగ్ ఖాన్ చూపించిన ఆప్యా...