భారతదేశం, సెప్టెంబర్ 24 -- Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆస్తి ఒకే సంవత్సరంలో ఏకంగా రూ. 2,490 కోట్లు పడిపోయినా, ఇండియాలోనే అత్యంత సంపన్న నటుడిగా తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ఆయన మొత్తం నెట్ వర్త్ రూ. 10,000 కోట్లుగా నమోదైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కంటే షారుఖ్ చాలా ముందంజలో నిలిచారు.

2025 హురున్ రిచ్ లిస్ట్‌లో షారుఖ్ నెట్ వర్త్ రూ. 12,490 కోట్లుగా ప్రకటించారు. కానీ ఈ ఏడాది వెలువడిన 2026 జాబితాలో అది రూ. 10,000 కోట్లకు పడిపోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌తో పాటు ఆయన వ్యాపారాలు, ముఖ్యంగా 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్', ఐపీఎల్ టీమ్ 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) షేర్ మార్కెట్ వ్యాల్యుయేషన్లలో మార్పుల వల...