భారతదేశం, ఏప్రిల్ 23 -- Serials: తెలుగు టీవీ సీరియల్స్ 15వ వారం టీఆర్‌పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. స్టార్ మా సీరియల్స్ అత్యధిక రేటింగ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, జీ తెలుగు సీరియల్స్ గట్టి పోటీనిస్తున్నాయి. 'కార్తీకదీపం 2', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లాంటి సీరియల్స్ టాప్ రేటింగ్స్ సాధించాయి.

తెలుగు బుల్లితెరపై సీరియల్స్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా రెండు ప్రధాన వినోద ఛానళ్లు అయిన స్టార్ మా, జీ తెలుగు తమ సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విడుదలైన 15వ వారం టీఆర్‌పీ (TRP) రేటింగ్స్‌ను పరిశీలిస్తే.. స్టార్ మా తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. మెజారిటీ ప్రేక్షకులు స్టార్ మా సీరియల్స్‌కే పట్టం కట్టారు.

స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2 - ఇది నవ వసంతం' 12.61 (U+R) రేటింగ్‌...