భారతదేశం, జూలై 28 -- Serial Heroine Shilpa Shinde On Family Issues: 'భాబీజీ ఘర్ పరి హై' సీరియల్‌లో అంగూరీ భాబీగా దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొంది, బిగ్ బాస్ 11 విజేతగా నిలిచిన టీవీ హీరోయిన్ శిల్పా షిండే జీవితంలో ఊహించని విషాదం దాగుంది.

తెరపై నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ అందరినీ నవ్వించే ఈ నటి, నిజ జీవితంలో సొంత కుటుంబం నుంచే తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రసారమవుతున్న 'లాక్ అప్' రియాలిటీ షోలో ఆమె వెల్లడించిన చేదు నిజాలు అభిమానులను, నెటిజన్లను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

ఈ ఓటీటీ షోలో నామినేషన్ల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తోటి పోటీదారు శివాంగి జోషి ఒత్తిడి మేరకు శిల్పా తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. మూడేళ్ల క్రితం తనకు భుజానికి సర్జరీ జరిగిన సమ...