Serial: 36 గంటలు నాన్‌స్టాప్ షూటింగ్, 40 నిమిషాలు మాత్రమే నిద్ర.. తన సీరియల్ కష్టాలు చెప్పిన హీరోయిన్ ప్రియాంక చౌదరి
భారతదేశం, జూలై 25 -- Priyanka Chahar Choudhary On 36 Hours Shooting: హిందీ బుల్లితెరపైనే కాకుండా మన తెలుగు నాట కూడా విశేష ఆదరణ పొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సీరియల్ 'నాగిన్'. తెలుగులో నాగినిగా సూపర్ హిట్ అయింది. లేడి ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ నిర్మాణంలో వచ్చిన 'నాగిన్ 7' సీజన్ ఇటీవలే విజయవంతంగా పూర్తయింది.
ఈ సిరీస్‌లో నాగిన్‌గా కనిపించి నటనతో ఆకట్టుకున్న ప్రముఖ నటి, సీరియల్ హీరోయిన్ ప్రియాంక చాహర్ చౌదరి, తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకుంది.
హిందీ బిగ్ బాస్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, నాగిన్ 7 ఆఫర్‌ను తొలినాళ్లలో తిరస్కరించాలని భావించినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.