భారతదేశం, నవంబర్ 29 -- Anupama Serial New Leap Trolled: దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సీరియల్ 'అనుపమ' (తెలుగులో 'ఇంటింటి గృహలక్ష్మి'కి మూలం) మరోసారి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది. రాజన్ షాహి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సీరియల్ ఏళ్లు గడుస్తున్నా టీఆర్పీ రేటింగ్స్‌లో మాత్రం సత్తా చాటుతోంది.

అయితే కథను ముందుకు నడిపించే క్రమంలో మేకర్స్ తీసుకుంటున్న 'లీప్' (కథలో కొన్నేళ్ల ముందుకు వెళ్లడం) నిర్ణయాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా అనుపమ సీరియల్ మరో కొత్త మలుపు తిరిగింది. ఈసారి అనుపమ ఏకంగా టీచర్/ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుండటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

రూపాలీ గంగూలీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి అనుపమ పాత్ర ఎన్నో వృత్తులను మారుస్తూ వచ్చింది. ఒక సాధారణ గృహి...