భారతదేశం, జూన్ 28 -- Kamala Nivas Serial First Night Cockroach Scene: కొన్నిసార్లు బుల్లితెరపై వచ్చే రోజువారీ సీరియల్స్ కొన్నిసార్లు ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తే.. మరికొన్నిసార్లు అస్సలు నమ్మశక్యం కాని వింత సీన్లతో షాక్‌కు గురిచేస్తుంటాయి. రేటింగుల వేటలో పడి కథకులు, దర్శకులు లాజిక్‌కు పూర్తిగా పాతర వేస్తున్నారు.

గతంలో ల్యాప్‌టాప్‌ను డిటర్జెంట్ సబ్బుతో కడగడం, హార్పిక్‌తో స్వీట్లు చేయడం, చీర కొంగు మెడకు చుట్టుకుని ఊపిరాడక చనిపోవడం వంటి విచిత్రమైన సీన్లు హిందీ సీరియల్స్‌లో చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయేలా ఓ బెంగాలీ సీరియల్‌లో ఏకంగా హీరో బొద్దింకను నమిలి తినేసిన సీన్ సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతోంది.

జీ బంగ్లా ఛానల్‌లో ప్రసారమవుతున్న 'కమల నివాస్' (Kamala Nivas) సీరియల్‌లోని ఈ వింత సీన్‌తో నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురైంది. ...