భారతదేశం, మే 6 -- భారతీయ వ్యాపార సామ్రాజ్యం అమెరికాలో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాషింగ్టన్ సమీపంలోని మేరీల్యాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'సెలెక్ట్ యూఎస్ఏ' సదస్సులో భారత కంపెనీలు కనీవినీ ఎరుగని రీతిలో భారీ పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాయి. ఒకే ఏడాది ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం సమిట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ పరిణామం అమెరికా మార్కెట్‌కు ఉన్న ఆకర్షణను, భారతీయ కంపెనీల ఆర్థిక పటిమను చాటిచెబుతోంది.

ఈ మొత్తం పెట్టుబడుల్లో అత్యధిక భాగం ఔషధ (Pharmaceutical) రంగం నుంచే రావడం విశేషం. భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికాలో తయారీ కేంద్రాలు, పరిశోధన, అభివృద్ధి (R&D) విభాగాల కోసం 19.1 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించనున్నాయి. ఇది కాకుండా స్టీల్, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కీలక రంగాల్లోనూ భారత్ తన ముద్ర వేయబోత...