భారతదేశం, సెప్టెంబర్ 18 -- Secret Soldier Review And Rating In Telugu: సాధారణంగా 'స్పై థ్రిల్లర్' కథలు అనగానే విదేశీ లోకేషన్లు, అసాధ్యమైన యాక్షన్ సీక్వెన్సులు, కమర్షియల్ హంగామా గుర్తుకొస్తాయి. వీటన్నింటికీ భిన్నంగా, రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు స్పై యాక్షన్ డ్రామా చిత్రం 'సీక్రెట్ సోల్జర్'.

విడుదలకు ముందే పలు రక్షణ శాఖల క్లియరెన్స్‌లు దాటుకుని రావడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. సెన్సార్ బోర్డ్ దగ్గరే 8 నెలల టైమ్ తీసుకున్న సీక్రెట్ సోల్జర్ సినిమాకు అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వం వహించారు.

నెల్లూరు నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించగా.. కమల్ కామరాజు, హర్షిత రావు, శ్రీష నూలు ఇతర పాత్రలు పోషించారు. మంచి అంచనాలతో ఇవాళ (సెప్టెంబర్ 1...