భారతదేశం, జూన్ 29 -- SCR Hyderabad Mangalore Special Trains : ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే (SCR) నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ డెక్కన్ - మంగళూరు స్టేషన్ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరికొంత కాలం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల తదుపరి సీజన్, పండుగలు, సాధారణ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇరువైపులా మొత్తం ఐదేసి (05) ట్రిప్పుల చొప్పున 10 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, టికెట్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ సూచించింది.

తిరుగు ప్రయాణంలో మంగళూరు నుంచి హైదరాబాద్ డెక్కన్‌కు వచ్చే ఈ ప్రత్యేక రైలు ప్రతి వారం గురు...